పోలీసుల అత్యుత్సాహం.. కాంగ్రెస్ నేతలపై పిడిగుద్దులు
పోలీసులు కాంగ్రెస్ నేతల అరెస్టు సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిపై పిడిగుద్దులు గుద్దుతూ అరెస్టు చేసి స్టేషన్ తరలించారు… వివరాల్లోకి వెళితే.. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి మృతికి నిరసనగా నిర్మల్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. వారు ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అరెస్ట్ చేసే క్రమంలో డీఎస్పీ గన్ మెన్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. నేతలపై పిడిగుద్దులతో వారిని వాహనాల్లో ఎక్కించారు. కాంగ్రెస్ కార్యకర్త ఇమ్రాన్ ను మొహంపై ఓ గన్మెన్, అలాగే వెనక భాగంలో మరోగన్మెన్ పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. దీంతో అతనికి గాయాలయినట్లు సమాచారం. ఈ ఘటన పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.