విద్యుత్ షాక్‌తో తండ్రి, కొడుకులు మృత్యువాత

Electric shock: మంచిర్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ షాక్ తో తండ్రీ కొడుకు మృతి చెందడంతో కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ క్వార్టర్లలో నివాసం ఉండే ఎడ్ల రాజేందర్ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. అతని కుమారుడు అరుణ్ కుమార్ బైక్ మెకానిక్ షోరూమ్ లో పని చేస్తున్నారు. తండ్రి రాజేందర్ స్నానం చేసి టవల్ దండంపై ఆరవేస్తుండగా కూలర్ విద్యుత్ వైరు తగిలి షాక్ కు గురయ్యారు. దీన్ని గమనించిన కొడుకు అరుణ్ కుమార్ తండ్రిని రక్షించబోయి తాను కూడా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. ఈ ఘటనలో తండ్రి కొడుకులు మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తండ్రికొడుకులు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు కమ్ముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.