మోదీజీ.. క్యా ఐడీయా జీ..

G20 Sammit: జీ 20లో పాల్గొనేందుకు వచ్చిన విదేశీ అతిథులందరి మొబైల్ వాలెట్లలో ప్రభుత్వం కొంత డబ్బును డిపాజిట్ చేసింది. దీని వెనక కూడా పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందండోయ్… G20 సమ్మిట్ విదేశీ సందర్శకులకు, అధికారులు, నేతలకు ఈ డబ్బులు ఈ వాలట్లో వేశారు. వారు ఇక్కడ ఏదైనా కొనుగోలు చేయాలంటే ముఖ్యంగా భారత్ మండపంలో పలు స్టాళ్లను ఏర్పాట్లు చేశారు. అక్కడ కానీ, మిగతా ప్రాంతాల్లో ఏదైనా కొనుగోలు చేయాలంటే ఈ వాలట్ వాడుకుంటే సరిపోతుంది.
డిజిటల్ చెల్లింపుల విషయానికి వస్తే మన దేశ అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శిస్తోంది. G20 సమ్మిట్ వేదికైన భారత్ మండపంలో ప్రదర్శించబడిన కొన్ని తాజా ఫిన్టెక్ ఆవిష్కరణలలో UPI, డిజిలాకర్, భాషిణి, ఆధార్, ఈసంజీవని మొదలైనవి ఉన్నాయి. విదేశీ అతిథులకు మన దేశంలో యూపీఐ పేమెంట్స్ ఎలా జరుగుతున్నాయి… కేవలం చిన్ని మొబైల్ ఆధారంగా డబ్బులు ఎలా చెలామణి చేస్తున్నారనేది తెలియజెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఈ యూపీఐ పేమెంట్లు సరిగ్గా జరగడం లేదు. UPI పేమెంట్ లావాదేవీలు చూసి మన దేశంలోని డిజిటల్ విప్లవం ఎలా కొనసాగుతుందో తెలియజెప్పడమే దాని ప్రధాన ఉద్దేశం.
అటు విదేశీ అతిథులకు సౌకర్యంగా ఉండటంతో పాటు మన దేశం సాధించిన డిజిటల్ విప్లవం వారికి తెలియజెప్పడం అన్నమాట. అందుకే వారి ఈ వాలెట్లలో కేంద్రం డబ్బులు వేసిందన్న మాట… ఐడియా అదిరింది కదూ..