మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ అన్నారు. మంగళవారం మహిళా ఆరోగ్య క్లీనిక్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలు ముఖ్యంగా మహిళల ఆరోగ్యం కోసం ఎన్నో కొత్త కార్యక్రమాలు చేపడుతున్న ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా మొత్తం 1200 మహిళా క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతి మంగళవారం ఉమెన్ క్లినిక్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ క్లినిక్‌ల ద్వారా మహిళలకు ప్రత్యేకంగా టెస్టులు చేస్తారు. 57 రకాల పరీక్షలు చేసి చికిత్సతో పాటు ఉచిత మందులు అందిస్తారని తెలిపారు. క్యాన్సర్, బీపీ, షుగర్, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్, పీసీవోడీ, వెయిట్ మేనేజ్మెంట్, రుతుస్రావ, మూత్రనాల ఇన్ఫెక్షన్, మధుమేహం, రక్తపోటు, రక్త హీనత, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్, సూక్ష్మ పోషకాల లోపాలు, నెలసరి, సంతాన పరీక్షలతో పాటు పలు రకాల టెస్టులు చేస్తారని వివరించారు.
అన్ని వయస్సు గల మహిళలకు మహిళా ఆరోగ్య క్లీనిక్ లో వైద్య సేవలు అందిస్తారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, ప్రోగాం అధికారి(ఎంహెచ్ఎన్)డాక్టర్ నీరజ, ప్రోగ్రాం అధికారి (ఫ్యామిలీ ప్లానింగ్) డాక్టర్ అరుణ శ్రీ, మంచిర్యాల డిప్యూటీ డీఎంఅండ్హెచ్ డాక్టర్ విజయనిర్మల, ఎంఎల్‌హెచ్‌పీ డాక్టర్ డైసీ, దీపక్ నగర్ మెడికల్ అధికారులు డాక్టర్ మానస, అశోక్ కుమార్, సీహెచ్‌వో రామ్మూర్తి, హెచ్‌ఈవో నాందేవ్, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, క్యాతన్‌పల్లి మేనేజర్ నాగరాజు, మందమర్రి నాయకులు బర్ల సదానందం, అబ్బాస్, సలోద్దీన్, శ్రీనివాస్ దీపక్ నగర్ యూపీహెచ్సీ ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.