మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Women’s Bill:ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏండుల గా పెండిగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.ఈ రోజు సాయంత్రం భేటీ అయిన మంత్రి మండలి దాదాపు రెండు గంటల పాటు పలు అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా మహిళా బిల్లుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇది సభలో ఆమోదం పొంది చట్టంగా మారితే .. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభించనుంది.
సోమవారం కేంద్ర కేబినెట్ సమావేశానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంత్రులతో సమావేశమయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి క్యాబిన్ లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, అనురాగ్ ఠాకూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్, వి మురళీధరన్ హాజరయ్యారు.