బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత.. బీజేపీ శ్రేణులపై రాళ్లదాడి..
నల్లగొండ : నల్లగొండ పర్యటనలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన ఉద్రికత్తకు దారి తీసింది. నల్లగొండ టౌన్‌లోని ఆర్జాల బావి ఐకేపీ కేంద్రం వద్ద టీఆర్ ఎస్ నేతలు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. అప్పటికే ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఐకేపీ సెంటర్ వద్దకు వచ్చి విలేకర్ల సమావేశం నిర్వహించారు. బండి సంజయ్ వస్తున్న విషయం తెలుసుకుని ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ శ్రేణులపై రాళ్లు రువ్వారు. బండి సంఝయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కర్రలతో దాడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరు వర్గాల్లో కొంత మంది కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.