15 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన

తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార పార్టీ భారీ బహిరంగ సభలకు ప్రణాళిక సిద్ధం చేసింది. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం పూరించేందుకు గులాబీ బాస్ సిద్ధమయ్యారు.ఈ క్రమంలో అక్టోబర్ 15 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. 15న హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.16వ తేదీన జనగామ, భువనగిరి నియోజకవర్గాల్లో,17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో,18న జడ్చర్ల, మేడ్చల్ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.