అమిత్ షా షెడ్యూల్ లో మార్పు
నేడు రాష్ట్రానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఆయన ఆదిలాబాద్, హైద్రాబాద్ ల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదట అమిత్ షా హైదారాబాద్ నుండి ఆదిలాబాద్ రావాల్సి ఉంది. కానీ మారిన షెడ్యూల్ ప్రకారం నాగపూర్ నుండి అదిలాబాద్, అక్కడి నుండి హైదరాబాద్ రానున్నారు. బీజేపీ ముఖ్య నేతలు పలువురు అమిత్ షా తో భేటీ కానున్నారు. ఎన్నికల సమాయత్తత, స్ట్రాటజీ, సమన్వయం పై మార్గనిర్దేశనం చేయనున్నారు అమిత్ షా. ప్రస్తుత రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించనున్నారు. సాయంత్రం 6.20 నుంచి 7.20 వరకు మేధావులతో అమిత్ షా భేటీ కానున్నారు. సిక్ విలేజ్ ఇంపిరియల్ గార్డెన్ లో సమావేశం నిర్వహించనున్నారు.
మారిన షెడ్యూల్ ఇలా..
మధ్యాహ్నం 2.50 కి నాగ్ పూర్ నుండి అదిలాబాద్ కు అమిత్ షా
మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆదిలాబాద్ జన గర్జన సభలో పాల్గొంటారు.
4.15 కు ఆదిలాబాద్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్ట్ బయలుదేరతారు.
5.05 బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు.
05.20 నుంచి 6 గంటల వరకు ఐటీసీ కాకతీయలో అమిత్ షా
6 గంటలకు ఇంపిరియల్ గార్డెన్ బయలుదేరతారు.
7.40 గంటలకు నుండి 8.40 వరకు ఐటీసీ కాకతీయలో వివిధ వర్గాలతో సమావేశం..
9 గంటలకి బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న షా