ప్రగతి భవన్ నుంచి వారికి పిలుపు.. ఆ నేతను పిలవలేదు
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్థులకు పిలిచారు. ఆరు ఎమ్మెల్సీ సీట్లకు గాను ఏడుగురిని పిలిచిన అధిష్టానం. గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎం. సీ. కోటిరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, కడియం శ్రీహరి, ఆకుల లలితల ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడంతో వారు వెళ్తున్నారు. ఇక ఇప్పటికే ప్రగతి భవన్ కు సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డి చేరుకున్నారు. ప్రగతి భవన్ లో మంత్రులు హరీష్ రావు,కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి తదితరులు మంతనాలు జరుపుతున్నారు. అయితే మధుసూదనాచారి కి అందని సమాచారం. గవర్నర్ కోటలో మధుసూదనాచారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది…