థాంక్యూ సజ్జనార్ సర్..
కోటపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల సమస్యల పై ఆర్టీసీ ఎండీకి ట్విట్ - ఉపాధ్యాయురాలి విజ్ఞప్తికి స్పందించిన సజ్జనార్

కోటపల్లి మోడల్ స్కూల్ లో చదువుకుంటున్న విద్యార్థుల రవాణా సౌకర్యం పై కస్తూర్భా పాఠశాల ఉపాధ్యాయురాలు భారతి చేసిన ట్విట్ కి RTC MD సజ్జనార్ స్పందించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుండి కోటపల్లి మోడల్ స్కూల్ కు సుమారు గా 200 మంది విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. ఉదయం పూట చెన్నూరు నుండి కోటపల్లి మోడల్ స్కూల్ కి రావడానికి సరైనన్ని బస్ లు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే మార్గంలో ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్న కోటపల్లి కస్తూర్భా పాఠశాల ఉపాధ్యాయురాలు భారతి విద్యార్థుల సమస్యలను వీడియో తీసి RTC MD కి ట్విట్ చేశారు. వెంటనే స్పందించిన సజ్జనార్ ప్రతిరోజు ఉదయం పూట చెన్నూరు నుండి కోటపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం అదనపు బస్ ప్రారంభానికి చర్యలు తీసుకున్నారు.