అభ్యర్థులకు అస్వస్థత

ఎన్నికల వేళ అభ్యర్థులు అస్వస్థతకు గురవుతున్నారు. తిరిగి తిరిగి అలిసిపోతున్నారో, లేక ఒత్తిడి తట్టుకోవడం లేదో కానీ.. అనారోగ్యం బారిన పడుతున్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య అస్వస్థతకు గురి కాగా, అయనను ఆసుపత్రికి తరలించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ కి జ్వరం రావడంతో ఆయన సైతం ప్రచారం ఆపేశారు. సమయం లేకపోవడంతో తప్పని సరి పరిస్థితిలో మధ్యాహ్నం తాండూర్ మండలంలో పర్యటించారు.
అయితే చిన్నయ్య అస్వస్థతకు కారణం పీకే స్ట్రాటజీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సైతం జోరందుకుంది. కేవలం సానుభూతి కోసమే ఇదంతా చేస్తున్నారని పలువురు ట్రోల్స్ చేయటం గమనార్హం.