అలుగుడు అలుగుడే.. కారుకు గుద్దుడే..
ఇంట్లో తండ్రినీ పెట్రోల్ కోసం పైసలు అడుగుతం.. 100 రూపాయలు అడిగితే, 50 ఇస్తే అలుగుతం.. ఆదివారం బయటికి పొయ్యి వచ్చేసరికి అవ్వ చికెన్ వండకుండా పెసరు పప్పు చెస్తే గులుగుతం.. అయినా ఆన్నం పెట్టే అవ్వా అయ్యను మర్చిపోం.. అలాగే మీ మండలానికి కోట్లాది రూపాయల తో అభివృద్ధి చేసిన ఎంతో పనిచేసిన నా పైన అలకలు ఉన్నా.. నన్ను గెలిపిస్తే మరింత సేవ చేస్తానని చెన్నూర్ బీఅర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ అన్నారు. బీమారంలోని పద్మశాలి కాలనీలో వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ తాను కేసీఆర్ తో మాట్లాడి భీమారం ప్రతేక మండలంగా ఏర్పాటు చేశామని తెలిపారు. మండల అభివృద్ది కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని, ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలని కోరారు. అందుకే తనను గెలిపిస్తే మరింత గా పనులు చేసుకుందామని అన్నారు. నన్ను ఇక్కడ కొందరు కొడుకా అంటరు.. మరికొందరు తమ్మీ అంటారు, ఇంకొందరు అన్నా అంటరు… కానీ కాంగ్రెస్ తరపున నిలబడ్డ వివేక్ నీ సారు అని పిలవాలి.. ఇలాంటివి ఆలోచిస్తేనే అర్దం అవుతుందని ఆయన స్పస్తం చేశారు.
నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచిన నీచపు చరిత్ర వివేక్ దని పార్టీలో చేరిన నాయకులు అన్నారు. నమ్ముకున్న కార్యకర్తలకు ఏం చేయలేని వాడు చెన్నూరు ప్రజలకు ఏం ఒరగబెడుతాడని ఎద్దేవా చేశారు. వివేక్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.