సుమనన్నా… నీ వెంటే మేమంతా..

Balka Suman: అన్న 60 ఏండ్ల పాటు మా ఊరికి బ్రిడ్జి నిర్మించలేదు.. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఉండే. నరకయాతన పడ్డం.. మీరు వచ్చాక మా ఊరికి బ్రిడ్జి వచ్చింది. అందుకే మీ వెంటే ఉంటాం.. మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని సుద్దాల గ్రామ ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్‌కు స్పష్టం చేశారు. ఆయన సుద్దాల గ్రామానికి వచ్చిన సందర్భంగా శ్రీ కోదండ రామాలయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పలువురు ప్రజలు ఆనందం పంచుకున్నారు. 10 గ్రామాల ప్రజల రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ రూ. 15 కోట్లతో 9 నెలల్లో సుద్దాల వాగు బ్రిడ్జ్ నిర్మించిన బీఆర్ఎస్ పార్టీనే భారీ మెజారితో గెలిపిస్తామని గ్రామ ప్రజలు వెల్లడించారు. 60 ఏళ్లు పాలించిన ఏ నాయకుడు తమ ఊరికి బ్రిడ్జి నిర్మించలేదని అలాంటి వారికి తమ గ్రామంలో ఓటు అడిగే హక్కు లేదని ప్రజలు స్పష్టం చేశారు.