ప్రజా ఆశీర్వాద సభ రద్దు
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇప్పటివరకు హైదరాబాద్ లో కేసీఆర్ ప్రచారాన్ని నిర్వహించలేదు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లకు రంగం సిద్ధం చేసింది. అయితే తెలంగాణకు రేపు కూడా వర్ష సూచన ఉండటంతో పాటు నగరంలో వర్షం పడుతున్న నేపథ్యంలో రేపు జరగాల్సిన ప్రజా ఆశీర్వాద సభను రద్దు చేస్తూ బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అటు హైదరాబాద్ లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ తరుణంలోనే పరేడ్ గ్రౌండ్లో జరగాల్సిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా వేసినట్లు వెల్లడించారు.