వివేక్ది నీచపు చరిత్ర

Balka Suman: కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ది నీచపు చరిత్ర అని చెన్నూరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ దుయ్యబట్టారు. చెన్నూరులో పాత బస్టాండ్ ఏరియా నుండి జలాల్ పెట్రోల్ బంక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి క్షణాల్లో కన్నతండ్రిని సంవత్సర కాలం పాటు పెయిడ్ నర్సులతో హాస్పటల్లో ఉంచిన నీచపు చరిత్ర వివేక్ దని దుయ్యబట్టారు. రూ. 100 కోట్ల ప్యాకేజీతో టికెట్లు తెచ్చుకున్న వివేక్ రేపు రూ. 1000 కోట్లు సంపాదించాలని చూస్తాడని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. రూ. 200 కోట్ల అక్రమ లావాదేవీలతో ఆధారాలతో సహా దొరికిన వివేక్ ఫెమా చట్టం కింద జైలుకు వెళ్లడం ఖాయమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కి వేసే ప్రతి ఓటు చెన్నూరు ప్రజల తలరాతన మార్చే ఓటు అని, చెన్నూరు ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఓటుగా అభివర్ణించారు. 24 గంటల కరెంట్ ఇచ్చే BRS కావాలా…. కారు చీకట్లో ఉంచే కాంగ్రెస్ కావాల్న… ప్రజలు తేల్చుకోవాలని కోరారు. నీతి, నిజాయితీ ఉన్న నిఖార్సైన కార్యకర్తలే నా బలం.. బలగం.. అని స్పష్టం చేశారు.