ఎమ్మెల్యే గో బ్యాక్
Durgam Chinnyya: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ప్రచారంలో చుక్కెదురయ్యింది. ఆయన ప్రచారాన్ని అడ్డుకున్న జనం ప్రచారం చేయకుండానే ఊరి పొలిమేరల నుంచి వెనక్కి పంపించారు. వివరాల్లోకి వెళితే.. దుర్గం చిన్నయ్య కన్నెపల్లి మండలం సూర్జాపూర్ కు శనివారం రాత్రి ప్రచారానికి వెళ్లారు. ఎమ్మెల్యేగా గెలిచి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా మా ఊరికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని రోడ్ల సౌకర్యం విద్యా వ్యవస్థ సౌకర్యాలు సరిగా లేవని ఊరి లోపలకి కూడా రానివ్వకుండా పొలిమేరల్లోనే అడ్డుకున్నారు. దీంతో ప్రచారం చేయకుండా ఎమ్మెల్యే వెనుదిరగాల్సి వచ్చింది. పోలీసులు జనాన్ని చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. రాత్రి తొమ్మిదిన్నర, పదిగంటల మధ్యలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.