సమస్యల పరిష్కారానికే పోటీ

బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని వాటన్నింటిని పరిష్కరిచేందుకే తన తండ్రి వినోద్ పోటీ చేస్తున్నారని గడ్డం వర్ష వెల్లడించారు. ఆమె ఆదివారం మాదారం టౌన్షిప్లో కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు, సీపీఐ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రచారానికి జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. ప్రజల నుంచి సైతం భారీ స్పందన వస్తోందని వెల్లడించారు. తన తండ్రి వినోద్ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. మాదారం టౌన్షిప్లో ఇంటింటికి తిరుగుతూ చేతి గుర్తుకే ఓటేయాలని కోరారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, మహిళలు పాల్గొన్నారు.