త‌గ్గెదేలే….

ఖ‌చ్చితంగా రైతుల‌ను ప‌రామ‌ర్శిస్తామ‌న్న బండి - అడ్డుకుని తీర‌తామ‌ని టీఆర్ ఎస్ శ్రేణుల వెల్ల‌డి - ఉద్రిక్త‌త‌ల న‌డుమ నేడు రెండో రోజు సంజ‌య్ ప‌ర్య‌ట‌న‌ - ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేసిన పోలీసులు..

రైతుల క‌ష్టాలు తెలుసుకునేందుకు తాను ప‌ర్య‌టిస్తాన‌ని బండి సంజ‌య్ ప్ర‌క‌ట‌న‌… ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్రం స్ప‌ష్ట‌మైన వైఖ‌రి ప్ర‌క‌టించేంత వ‌ర‌కు సంజ‌య్ ప‌ర్య‌ట‌న అడ్డుకుని తీరుతామ‌ని టీఆర్ ఎస్ శ్రేణుల హెచ్చ‌రిక‌లు ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీస్తున్నాయి. సోమ‌వారం ఆయ‌న ప‌ర్య‌ట‌న ఆసాంతం దాడులు, ప్ర‌తిదాడుల మ‌ధ్య న‌డిచింది. మంగ‌ళ‌వారం కూడా అదే రీతిన కొన‌సాగే అవ‌కాశం ఉంది. దీంతో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

ర‌ణ‌రంగంగా నిన్న‌టి ప‌ర్య‌ట‌న‌..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ పర్యటన రణరంగంగా మారింది. సోమ‌వారం ఆసాంతం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆయ‌న ప‌ర్య‌ట‌న అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారు. దీంతో ఉద్రిక్త‌త ప‌రిస్తితులు నెల‌కొన్నాయి. దీంతో బీజేపీ శ్రేణులు సైతం ప్ర‌తిదాడులు చేశారు. పలుచోట్ల ఇరువర్గాలు రాస్తారోకోలకు దిగాయి. కొన్నిచోట్ల పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టాల్సి వచ్చింది. దాడులు, లాఠీచార్జిలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.

నేటి ప‌ర్య‌ట‌నకు గ‌ట్టి బందోబ‌స్తు…

నేడు సూర్యాపేట జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. ఆత్మకూర్ (ఎస్), జాజిరెడ్డి గూడెం, తిరుమలగిరి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంజయ్ పరిశీలించనున్నారు. అనంతరం సూర్యాపేట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సోమ‌వారం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాఉడూత తాను త‌ల‌చుకుంటే ఒక్క‌రూ రోడ్ల‌పై తిర‌గ‌ర‌ని హెచ్చ‌రించారు. కేసీఆర్‌ను జైలుకు పంపుతామ‌న్నారు.

 

 

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like