సింగరేణి కార్మికుడి దుస్తుల్లో రామగుండం ఎమ్మెల్యే
Telangana Assembly: అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సింగరేణి కార్మికుల దుస్తులు ధరించి అసెంబ్లీ వెళ్లారు. ఆయన అదే దుస్తుల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. సమావేశాల దృష్ట్యా అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పాసులు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ లోపలికి అనుమతిస్తున్నారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు అసెంబ్లీకి నాలుగు కిలో మీటర్ల పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.