అన్నదాత సుఖీభవ అభినందనీయం
గర్భిణీలు, బాలింతలకు అండగా బాలింతలకు అభినవ అండ - జిల్లా సంక్షేమాధికారి మాస ఉమాదేవి
మంచిర్యాల జిల్లా // అభినవ సేవలు అభినయని జిల్లా సంక్షేమ అధికారి మాస ఉమాదేవి అన్నారు. మంగళవారం తాండూర్ మండలం కత్తెర్లలో అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న అభినవ స్వచ్ఛంద సేవలు శ్లాఘనీయమన్నారు. విద్యార్థులకు అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. వారికి స్టడీ మెటీరియతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని ఇది ఎంతో సంతోషకర విషయమన్నారు. మూడు సంవత్సరాలుగా మండలంలోని నిరుపేద గర్భిణీ బాలింతలకు సైతం నిరంతరంగా పౌష్టికాహారం అందిస్తున్న అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంతోష్ కుమార్‌ను అభినందించారు. అనంతరం గ్రామంలో ఉన్న మహిళలకు గర్భిణులకు పౌష్టికాహారం బియ్యం గోధుమపిండి పెసరపప్పు కందిపప్పు గుడ్లు, పండ్లు అందించారు. కార్యక్రమంలో అభినవ సంతోష్ కుమార్ , కాసం ఆకాష్ ,రాజ్ కిరణ్ , శ్రీకాంత్ , శ్రీనివాస్ , విజయ్, ప్రవీణ్ , ప్రదీప్ , బోగారపు బాను , మడే సుమలత , అంగన్వాడీ సూపర్ వైజర్ రమాదేవి , టీచర్లు అమృత , శారద తదితరులు పాల్గొన్నారు