రెండు రోజులపాటు తిరుమల నడకదారులు… బంద్!
రెండు రోజుల పాటు అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదారులు మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. నవంబర్ 17, 18 తేదీల్లో ఈ రెండు నడక దారులు మూసి వేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ‘రెండు రోజులపాటు తిరుమలకు వెళ్లే రెండు నడకదారులు (అలిపిరి, శ్రీవారిమెట్టు) తాత్కాలికంగా మూసివేయనున్నట్లు స్పష్టం చేశారు. భక్తుల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. తిరుమలకు వెళ్లే భక్తులు ఈ విషయం గుర్తించి, ఘాట్ రోడ్ ప్రయాణమే సురక్షితమని’ టీటీడీ అధికారులు సూచించారు.