అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు

Rotten eggs at Anganwadi center:మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఏసన్ వాయి అంగన్ వాడి కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నారు. కేంద్రానికి ఇటీవల కాంట్రాక్టర్ సరఫరా చేసిన కోడిగుడ్లను శనివారం అంగన్వాడీ కేంద్రంలో లబ్దిదారులకు అందజేశారు. వారు ఇంటికివెళ్లి కోడిగుడ్లను పరిశీలించగా అవి కుళ్లిపోయి, దుర్వాసన వెదజల్లుతున్నాయి.వాటిని తీసుకెళ్లి అంగన్వాడీ టీచర్లను అడుగగా కేంద్రానికి వచ్చిన గుడ్లను తాము పంపిణీ చేశామని చెప్పారు. దీంతో చేసేదేమీలేక లబ్దిదారులు గుడ్లను బయట పడేశారు.