సెప్టెంబర్ 17కు కొత్త పేరు పెట్టిన రేవంత్ సర్కార్
Telangana : సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోయే రోజు. నిజాం నిరంకుశత్వాన్ని తెంచుకుని ప్రజాస్వామ్యంలో కలిసిన రోజు. ఈ సెప్టెంబర్ 17 ప్రతీ సంవత్సరం తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారి తీస్తూనే ఉంటుంది. ఈ రోజును ఒక్కో పార్టీ ఒక్కో విధంగా జరుపుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఈ సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇక రాష్ట్రంలోని మిగతా 32 జిల్లాల్లో కూడా మంత్రులు జెండాలు ఎగురవేసి.. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని జరపనున్నారు.
జిల్లాల్లో జెండా ఎగరవేసేది వీరే…
1. ఆదిలాబాద్ – షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు(SC, ST, OBC, మైనారిటీ సంక్షేమం)
2. భద్రాద్రి కొత్తగూడెం-తుమ్మల నాగేశ్వర రావు, వ్యవసాయ శాఖ మంత్రి
3.హన్మకొండ -కొండా సురేఖ, పర్యావరణ & అటవీ, దేవాదాయ శాఖ మంత్రి
4. జగిత్యాల – ఎ. లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్
5.జయశంకర్ భూపాలపల్లి – పోడెం వీరయ్య, ఛైర్మన్ తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్,
6.జనగాం- బీర్ల ఇల్లయ్య, ప్రభుత్వం విప్
7.జోగులాంబ గద్వాల్- ఏపీ జితేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు)
8.కామారెడ్డి- పటేల్ రమేష్ రెడ్డి, ఛైర్మన్ తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్
9. కరీంనగర్ -డి.శ్రీధర్ బాబు, ఐటీ మంత్రి
10. ఖమ్మం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
11.కుమురంభీమ్ ఆసిఫాబాద్-బండ ప్రకాష్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్
12. మహబూబాబాద్ – జె. రాంచందర్ నాయక్,ప్రభుత్వం విప్
13. మహబూబ్ నగర్ -జూపల్లి కృష్ణరావు, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ మంత్రి
14. మంచిర్యాల- హరకర వేణుగోపాలరావు, ప్రభుత్వ సలహాదారు
15.మెదక్ – కె. కేశవ రావు ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)
16. మేడ్చల్ -పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ
17. ములుగు – మంత్రి సీతక్క
18. నాగర్‌కర్నూల్- జి. చిన్నారెడ్డి వైస్-ఛైర్మన్, ప్లానింగ్ బోర్డ్
19.నల్గొండ- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
20. నారాయణపేట – గురునాథ్ రెడ్డి, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్ పర్సన్
21. నిర్మల్ – రాజయ్య, సిరిసిల్లా చైర్‌పర్సన్, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్
22. నిజామాబాద్ – అనిల్ ఎరావతి, తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ చైర్‌పర్సన్
23. పెద్దపల్లి – నేరెళ్ల శారద, తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్
24. రాజన్న సిరిసిల్ల- ఆది శ్రీనివాస్, ప్రభుత్వం విప్
25. రంగారెడ్డి- వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు
26. సంగారెడ్డి- మంత్రి దామోదర రాజనరసింహ
27. సిద్దిపేట – మంత్రి పొన్నం ప్రభాకర్
28. సూర్యాపేట- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
29. వికారాబాద్ – స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
30. వనపర్తి – ప్రీతమ్, చైర్‌పర్సన్, తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్
31. వరంగల్ – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
32.యాదాద్రి భువనగిరి – గుత్తా సుఖేందర్ రెడ్డి గౌరవ చైర్మన్, TSLC