బాలాపూర్ లడ్డూ రికార్డు ధర
Balapur laddu: ప్రతి సంవత్సరం కొత్త రికార్డులు సృష్టించుకొని పైపైకి వెళ్తోంది బాలాపూర్ గణేష్ లడ్డూ. ఈసారి కూడా అందరి అంచనాలకు తగ్గట్టుగానే పోటాపోటీగా సాగింది వేలం. స్థానికుడైన కొలను శంకర్ రెడ్డి 30 లక్షల 1000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈసారి 3.01 లక్షలు ఎక్కువగా లడ్డూకు ధర పలకడం విశేషం. వేలం అనంతరం కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు డబ్బులను అందజేశారు. రూ. 1,116తో వేలం ప్రారంభం కాగా.. పోటాపోటీగా సాగిన వేలంలో కొలను శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.
గతేడాది హైదరాబాద్ శివారు తుర్కయంజాల్‌కు చెందిన దాసరి దయానంద్ అనే వ్యక్తి 27 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు. కాగా, ఈ ఏడాదితో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. లడ్డూవేలాన్ని తొలిసారిగా 1994లో నిర్వహించారు. ఆ ఏడాది బాలాపూర్‌కే చెందిన కొలను మోహన్ రెడ్డి రూ.450కు లడ్డూ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏయేడాది కాయేడు రికార్డు ధరల పలుకుతూ లడ్డూ ప్రసాదం రూ.వందల నుంచి రూ.లక్షలకు చేరింది.
లడ్డూకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తొలిసారిగా నిర్వాహకులు వేలంలో కొత్త నిబంధనను తీసుకువచ్చారు. లడ్డూ వేలంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే డబ్బును డిపాజిట్ చేయాలని నిబంధనను పెట్టారు. గతేడాది రూ.27 లక్షలు పలకగా.. ఆ మెుత్తాన్ని డిపాజిట్ చేసిన పలువురు భక్తులు వేలంలో పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన వేలంలో చివరకు కొలను శంక రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.