పేకాట స్థావరంపై పోలీసుల దాడి
మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ ఇందిరానగర్ ఏరియాలోని పాత కోళ్ళ ఫారంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాటస్థావరంపై టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని మందిని అదుపులోకి తీసుకొని రూ.30,970 నగదు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గుమ్మడెల్లి భాస్కర్, రాజవరపు వెంకటేశ్వర్లు, తిప్పని సందీప్, ముద్దసానిసదానందం, దుర్గంశ్రీనివాస్, ఎల్కశ్రీధర్, ముద్దంగుల నాగరాజు, బోగేరమేష్, మాసు రాయలింగును అదుపులోకి తీసుకున్నారు.