ఖాకిచకుడు

CI attempted to rape the girl: ప్రజల మాన, ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే దారుణాలకు ఒడి గడుతున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. కాజీపేట సీఐ రవికుమార్ ఓ బాలికపై అత్యాచారయత్నం చేశారు. హనుమకొండ వడ్డేపల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఇంటికి రాగానే తల్లిదండ్రులకు బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో హుటాహుటిన వెళ్లి కాజీపేట పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐపై లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సీఐ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమాజంలో అత్యాచార ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే దారుణాలకు పాల్పడటం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.