సన్న బియ్యానికి రూ. 500 బోనస్
Telangana Cabinet Meeting: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీలు సహా మేనిఫెస్టోపై కేబినెట్ చర్చించింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నివేదికపై చర్చించిన కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సన్న బియ్యానికి రూ.500 బోనస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర రూ. 7వేల కోట్ల పై చిలుకు అప్పు కోసం కేబినేట్ చర్చించింది. కేంద్ర సంస్థల దగ్గర రూ. 30 వేల కోట్ల రుణాలు తీసుకోవడానికి రాష్ట్రంలోని రోడ్లను తనఖా పెట్టడానికి సైతం సమావేశంలో చర్చించారు. ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీకి భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మద్నూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసేందుకు మంత్రి మండలి అంగీకరించింది. హన్మకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంపునకు ఆమోదం తెలిపింది. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు గ్రీనిసిగ్నల్ ఇచ్చింది.