తెలంగాణలో ఆ ఫుడ్ పై నిషేధం

Telangana: ప్రజల ప్రాణాలు హరించివేస్తున్న మయోనైజ్‏పై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోటళ్లలో తనిఖీలు, కల్తీ ఆహార పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి నియమించిన టాస్క్‌ఫోర్స్‌‌ కమిటీల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో మయోనైజ్‌ను తయారు చేస్తున్నారని అధికారులు మంత్రి దామోదరకు చెప్పారు. అందులో కల్తీ, ఉడకబెట్టని గుడ్లను ఉపయోగిస్తున్నారని.. దీని వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం పడుతోందని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం మయోనైజ్ పై బ్యాన్ విధించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోనూ మయోనైజ్ ను నిషేధం విధించాలని అధికారులు సూచించారు. సుదీర్ఘ చర్చల అనంతరం మయోనైజ్‌పై బ్యాన్ విధించాలని మంత్రి నిర్ణయించారు.

రాష్ట్రంలో నూతనంగా 3 ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు, 5 మొబైల్‌ ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని దామోదర రాజనర్సింహా ఆదేశించారు. కల్తీ ఆహారపదార్థాల్ని తీసుకొని పలువురు తీవ్ర అనారోగ్యం పాలవుతోన్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.సాధారణంగా ఈ మయోనైజ్‌ను ఎక్కువగా మండి బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌లు,ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకుని తింటారు. ఇటీవల జరిగిన ఘటనలతో బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం అప్రమత్తమైంది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ హోటళ్లు తీరు మారట్లేదంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు ఆ పదార్థాన్ని నిషేధించేందుకు అనుమతి కోరింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like