కేసీఆర్ ప్రజలపై భారం మోపుతున్నాడు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు
ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్య ప్రజలపై భారం మోపడుతున్నాడని బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీజేనపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించి ఊరట కల్పించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించకుండా వాహనదారుల పై పన్ను భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా 25 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాట్ తగ్గించి ఆ రాష్ట్ర ప్రజలకు పన్ను భారం తగ్గించాయని స్పష్టం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేసి ఇక్కడ మాత్రం పన్నులు తగ్గించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించకపోవడం వల్ల సామాన్యుడు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ధరల ప్రభావం సామాన్యుడిపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం వెంటనే వ్యాట్ తగ్గించాలని లేకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, కొయ్యల ఏమాజి పెద్దపల్లి పురుషోత్తం, అరుమల్ల పోశం, , కర్ణ శ్రీధర్, రాజు లాల్ యాదవ్, కోయాల్కర్ గోవర్ధన్, శంకరయ్య, ఆకుల అశోక్ వర్ధన్, పట్టి వెంకట కృష్ణ, బోద్దున మల్లేష్, మధు, వీరమల్ల హరి గోపాల్, పైడిమళ్ల నర్సింగ్, వేల్పుల శ్రీనివాస్, విశ్వంభర్ రెడ్డి, బోయిని హరికృష్ణ, సోమ ప్రదీప్ చంద్ర, బోయిని లలిత, రాచకొండ సత్యనారాయణ, పచ్చ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.