కులగనణ.. బహిష్కరణ..

Dilawarpur:తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన సమగ్ర కుల గణన సర్వే బహిష్కరిస్తున్నట్లు నిర్మ‌ల్ జిల్లా దిలావ‌ర్‌పూర్ గ్రామస్తుల ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఇథ‌నాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా దిలావ‌ర్‌పూర్‌ గ్రామస్తుల కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఇక్క‌డ ఫ్యాక్ట‌రీని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. తాము కులగణన సమగ్ర సర్వేకు దూరంగా ఉంటామని తహసిల్దార్ కు గ్రామ‌స్థులు లేఖ ఇచ్చారు.

నిర్మ‌ల్ జిల్లాలో దిలావర్ పూర్‌, గుండంపల్లి గ్రామాల మధ్య నెలకొల్పనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ మా కొద్దు అని ఆయా గ్రామాల ప్రజలు, రైతులు దాదాపు 110 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. తమ ప్రాంతంలో ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ వివిధ రకాల నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే గ్రామస్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కలిసి సమస్యను వివరించారు. ప్రజారోగ్యన్ని దెబ్బతీసే పరిశ్రమను ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఏర్పాటు చేయడం భావ్యం కాదని, వ్యవసాయం పని ఆధారపడి ఉన్న ఈ ప్రాంతంలో రైతులకు జీవనోపాధి లేకుండా ఫ్యాక్టరీ నిర్మించడం సమంజసం కాదని హెచ్చరిస్తున్నారు. గత శాసనసభ ఎన్నికలకు ముందు ప్రస్తుత పాలకులు, ఎన్నో హామీలు ఇచ్చి నిర్మాణ పనులు నిలిపివేసి, కొద్దిరోజులుగా మళ్లీ తిరిగి ప్రారంభించడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇథ‌నాల్ పరిశ్రమ ఏర్పాటైతే భావితరాలకు ఇబ్బందులు తప్పవని ఈ ప్రాంత వాసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

పంట పొలాలను కలుషితం చేసే ఈ పరిశ్రమ తరలించాలంటూ గుండంపెల్లి, దిలావర్‌పూర్‌, న్యూలోలం, సముందర్‌పెల్లి గ్రామాలకు చెందిన దాదాపు 10 వేల మంది రైతులు, ప్రజలు ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టి, పరిశ్రమల లోపలికి చొచ్చుకెళ్లి గోడలు, సామగ్రి, షెడ్లను కూల్చివేసి టిప్పర్ల అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడున్న స్కార్పియో వాహనానికి నిప్పుపెట్టారు. ఇప్పటికి ముగ్గురు జిల్లా కలెక్టర్లు గ్రామానికి వెళ్లి గ్రామస్థులతో తీవ్ర చర్చలు జరిపారు అయినప్పటికీ శశి మేరా అని రైతులు భీష్మంచి కూర్చుంటున్నారు. పరిశ్రమ రావడంతో స్థానిక రైతులకు లాభమేగాని నష్టం లేదని చెప్పినా రైతులు వినడం లేదు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కుల‌గ‌ణ‌న బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు దిలావర్‌పూర్ ప్రాంత ప్ర‌జ‌లు తీసుకున్న నిర్ణ‌యం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. మ‌రి అధికారులు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి

Get real time updates directly on you device, subscribe now.

You might also like