మందు తాగారా..? ఆసుపత్రి శుభ్రం చేయండి
Drunk and drive:డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన వారికి వారం రోజులు ఆసుపత్రి శుభ్రం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుపడ్డ 27 మందిని కోర్ట్ లో హాజరుపరిచారు. ఫస్ట్ అడిషనల్ సివిల్ మెజిస్ట్రేట్ ఉపనిషద్వుని 27 మందికి వారం రోజులు మంచిర్యాల జిల్లా మతా శిశు కేంద్రం ఆసుపత్రిలో శుభ్రం చేయాలని కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించారు.
దీంతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ B. సత్యనారాయణ ఆధ్వర్యంలో
మంచిర్యాల జిల్లా మతా శిశు కేంద్రం ఆసుపత్రిని గురువారం నుంచి శుభ్రం చేయించే పనులు చేస్తున్నారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలను నడపాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు.