తెలంగాణ, ఏపీ లో భూ ప్రకంపనలు
Earthquakes in Telangana, AP: తెలుగు రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కొత్తగూడెం, ఖమ్మలోని చర్ల, మణుగూరు సహా పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం 7.10 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. తెలంగాణలో రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదైనట్లు సమచారం. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు వచ్చారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు,గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది.