ఏసీబీ వలలో మార్కెటింగ్ అధికారి
ACB ATTACK: నిర్మల్ జిల్లాలో మరో అధికారి ఏసీబీ చేతికి చిక్కారు. జిల్లా మార్కెటింగ్ అధికారి తంగడిపల్లి శ్రీనివాస్ లంచం తీసుకుంటుడగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కుమ్మరి వెంకటేష్ దడ్వాయి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నుండి ఈ లైసెన్స్ జారీ చేయాల్సి ఉంటుంది. దీని కోసం కార్యాలయ ఏవో తంగడిపల్లి శ్రీనివాస్ రూ.10,000 లంచం డిమాండ్ చేశారు. వెంకటేష్ అభ్యర్థన మేరకు లంచం మొత్తాన్ని రూ.10,000 నుండి రూ.7,000 కి తగ్గించాడు. రూ.7,000 ఇస్తే లైసెన్స్ ఇస్తానని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం మధ్యాహ్నం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో ఉందని అధికారులు వెల్లడించారు.