ప్రేమ్ సాగర్ రావు అడిగాడు.. ఇచ్చేద్దాం..
-గూడెం సత్యదేవుని ఆలయం అభివృద్ధికి చేయూత ఇద్దాం
-ఉమ్మడి ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటా
-పెద్దపల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ప్రేమ్ సాగర్ రావు అడిగాడు.. ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేసిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి స్పందించారు. ప్రేమ్ సాగర్ రావు ప్రతిపాదనలకు సభాముఖంగా ఆమోదం పలికారు.
దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కోరిక మేరకు సత్య దేవుని ఆలయం ఆధునీకరణకు నిధులివ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టికి సూచించారు. ప్రేమ్ సాగర్ రావు ఏది అడగడు అడిగింది ఇవ్వాల్సిందేనని మరోమారు స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకోమన్నాడు తీసుకుంటానని సీఎం చెప్పారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉమ్మడి జిల్లా, కరీంనగర్ జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తానని రేవంత్ స్పష్టం చేశారు.