బ్రేకింగ్: నాలుగో వ్యక్తి కూడా మృతి
ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాన్యత్నం చేసుకున్న ఘటనలో ఇంటి యజమాని కూడా మృత్యువాత పడ్డారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మంగళవారం ఆత్మహత్యా ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. సముద్రాల మొండయ్య (60), శ్రీదేవి ( 50), కూతురు చిట్టి (30) కుమారుడు శివ ప్రసాద్ (26) ఆర్థిక ఇబ్బందులతో మంగళవారం ఉదయం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. వారు నిన్నటి నుండి వరంగర్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . ఇందులో ఉదయం శ్రీదేవి, చైత్యన(చిట్టి), కుమారుడు శివ ప్రసాద్ చనిపోయారు. కాగా అరగంట కిందట యజమాని సముద్రాల మొండయ్య సైతం కన్ను ముశాడు.