నేరాల నియంత్రణకే పోలీసుల పల్లె నిద్ర
నేరాల నియంత్రణకే పోలీసులు పల్లె నిద్రలు చేస్తున్నారని మాదారం ఎస్ఐ సౌజన్య అన్నారు. సోమవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత పోలీసుల బాధ్యత అన్నారు. గ్రామాల్లో కి కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. టౌన్షిప్ లో ఎక్కడైనా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్ముతున్నట్లు తెలిస్తే తెలియజేయాలని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జరుగుతుందన్నారు. యువత చెడు అలవాట్లకు గంజాయి, మద్యం, డ్రగ్స్ బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఎక్కడైనా ఉన్నట్టు సమాచారం తెలిస్తే సమచారం ఇవ్వాలన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని లేదా 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్, వాట్సాప్ కాల్స్ లకు స్పందించవద్దని సూచించారు.