లైంగిక వేదింపుల కేసులో యూట్యూబర్ అరెస్ట్
Prasad Behara Arrest: యూట్యూబర్ ప్రసాద్ బెహరాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మణికొండకు చెందిన బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టుచే శారు. అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న తనను ప్రసాద్ బెహరా తనను లైంగికంగా వేధించాడని యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రసాద్ బెహరాను అరెస్టు చేశారు. ఈ మేరకు ప్రసాద్ బెహరాపై 75(2),79, 351(2) బీఎన్ఎస్ సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పలు వెబ్ సిరీస్ లతో పాటు కమిటీ కుర్రాళ్లు సినిమాలో ప్రసాద్ బెహరా నటించారు.
కమిటీ కుర్రాళ్లు సినిమాలో పెద్దోడు పాత్రతో ఆకట్టుకున్న ప్రసాద్ బెహరా ప్రస్తుతం అల్లరి నరేష్ బచ్చల మల్లి సినిమాలో నటించారు. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన ప్రసాద్ బెహరా కామెడీ సిరీస్ లు చేస్తూ యూట్యూబ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న ప్రసాద్ బెహరాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. షూటింగ్ సమయంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించడం, తాకడం వంటివి చేసేవాడనీ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.