పోలీసులకు కమిషనర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి మంచిర్యాలలో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, అడ్మిన్ అడిషనల్ డీసీపీ రాజుతో కలిసి పరిస్థితులను అడగి తెలుసుకున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది కి సూచించారు. విధులలో ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి పోలీస్ కమిషనర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మంచిర్యాల ఏసీపీ ప్రకాష్,ఏ ఆర్ ఏసీపీ సుందర్ రావు, పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆర్ ఐ సంపత్ ఉన్నారు.