కేశవపట్నంలో ఉద్రిక్తత
Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవ పట్నంలో అటవీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమ కలప నిల్వ ఉందనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు గ్రామానికి వెళ్లారు. కొంతమంది స్థానికులు ఎదురు తిరగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తమపై కొందరు రాళ్లు రువ్వినట్లు చెబుతున్న అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనలో అటవీ శాఖ వాహనం అద్దాలు పగిలాయి. ఒక్కరి కి గాయాలయ్యాయి. పోలీసులు, అటవీశాఖ అధికారుల సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి.