కోడి పందాల స్థావరంపై పోలీసుల దాడి
Police raid on chicken betting base: కోడిపందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఈస్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాస్పల్లి పెద్దవాగు పరీవాహక ప్రాంతాలను అడ్డాలుగా చేసుకుని కొందరు కోడిపందాలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్,ఎస్ఐ వెంకటేశ్ రెండు బృందాలుగా ఏర్పడి పెద్దవాగు పరీవాహక ప్రాంతంలో కోడిపందాల స్థావరంపై దాడి చేసి పట్టుకున్నారు. గజ్జిగూడకు చెందిన తొగరి సాంబయ్య, గజ్జి అంజయ్య, ధరణి జనార్ధన్, మాదాసు ఇంద్రసేన్, రాస్పల్లికి చెందిన నాగోషి రామయ్య, నాగోషి సురేందర్, పెరక లింగమూర్తి, లగోటి దిలీప్, జండగూడకు చెందిన సదుల్ల ముత్తయ్య, నస్పూరి రాజులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు పందెం పుంజులు, రూ. 3,020, పది 10 మోటర్ వాహనాలు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో CI రాణా ప్రతాప్, SI వెంకటేష్, కానిస్టేబుళ్లు రమేష్, మధు, దేవేందర్, సంజీవ్ పాల్గొన్నారు.