కోటపల్లిలో కోడిపందాలు

Cock racing in Kotapalli: కోటపల్లిలో కోడిపందాలు నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. కోటపల్లి మండలం నాగంపేట బొప్పరం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 10 కోళ్ళు , 7 మొబైళ్లు, రూ. 59.78 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 బైక్‌లు సీజ్ చేశారు. పోలీసుల రాకను గమనించిన పందేం రాయుళ్లు తమ వాహనాలను అక్కడే వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో జనగామ మల్లయ్య, పొట్టల రాజేందర్, సునాట్కారి రాజేష్, దుర్గం రమేష్, చిప్పకూర్తి బాపు, వెంకట్, గాండ్ల రవి ఉన్నారు.