భవన నిర్మాణ కార్మికుడికి విద్యుత్ షాక్
-తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స
-కేసు కాకుండా కొందరి ప్రయత్నాలు
-న్యాయం చేయాలని ఎస్సీ సంఘాల డిమాండ్

భవన నిర్మాణ కార్మికుడికి విద్యుత్ షాక్ తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలో రామకృష్ణాపూర్ కి చెందిన పోశం అనే కార్మికుడు పనులు చేస్తున్నాడు. ఒక భవనానికి సంబంధించిన పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో తీవ్ర గాయాల పాలైన అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి హైదరబాద్ లోని యశోద హాస్పిటల్ తరలించారు.
కేసు కాకుండా ప్రయత్నాలు..
అయితే ఈ విషయంలో కేస్ కాకుండా ఉండేందుకు భవన యజమాని ప్రయత్నాలు చేస్తున్నాడు. తనకు ఉన్న రాజకీయ పలుకుబడితో కేసు కాకుండా బాదితులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఎంతో కొంత ముట్టజెప్పి చేతులు దులుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో బాధితులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు.
ఎస్సీ సంఘాల ఆగ్రహం..
పోషం న్యాయం జరగకపోగా, సరైన నష్ట పరిహారం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న భవన యజమాని పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ తనకి న్యాయం జరగకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.