తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య

SI Suicide in Police Station: పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ మూర్తి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి.. ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆయను వీఆర్‌కు బదిలీ చేశారు. అయితే పెనుగొండలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో విధులు నిర్వహించేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో తణుకు రూరల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి బాత్ రూమ్‌లో తలపై తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే స్టేషన్‌లో ఉన్న పోలీస్ సిబ్బంది ఎస్‌ఐని ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆయన మృతి చెందారు. తనను వీఆర్‌కు పంపారన్న మనస్తాపంతోనే మూర్తి సూసైడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మూర్తిపై ఈమధ్య చాలా ఆరోపణలు వచ్చాయి. కొన్నాళ్లుగా ఆయన వివాదాల్లో ఉన్నారు. చివరకు ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత శుక్రవారం ఉదయం స్టేషన్‌కి వచ్చిన ఆయన, గన్‌తో కాల్చుకున్నట్లు తెలిసింది. మనస్తాపంతోనే మూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఐతే.. అసలు విషయాలు తెలియాల్సి ఉంది. మూర్తిని బలవంతంగా సస్పెండ్ చేశారా? లేక ఆయనపై ఉన్న ఆరోపణల్లో ఎక్కడైనా తేడా వచ్చి, ఈ సూసైడ్ చేసుకున్నారా అనేది తేలాల్సి ఉంది.