బాసరలో దిల్‌రాజు హల్‌చల్

Basara: బాసర సరస్వతి అమ్మవారిని నిర్మాత దిల్ రాజు(Produced Dil Raju) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయన తన కుమారుడికి అక్షరాభ్యాసం చేయించారు. అయితే, అక్కడికి వచ్చిన భక్తులు అటు దిల్ రాజు, ఇటు ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు గంటలుగా క్యూ లైన్లో తాము వేచి ఉంటే వీఐపీలకు ప్రత్యేకం దర్శనం ఏంటని దుయ్యబట్టారు. అమ్మ వారి దర్శనానంతరం క్యూలైన్లో భక్తుల మధ్యలో నుంచి తోసుకుంటూ దిల్ రాజు బయటకు వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో పలువురు భక్తులు ఆలయ సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు కాదని వీఐపీలకు పెద్దపీట వేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతి ఏటా ఇలాగే అవుతున్నా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. సామాన్యులకే పెద్ద పీట వేస్తామని అధికారులు ప్రతి సారి చెప్పడం తాము ఇబ్బందులు పడటం కామన్ అయ్యిందని దుయ్యబడుతున్నారు. వసంత పంచమి నేపథ్యంలో సోమవారమైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు.