ఎమ్మెల్సీ కవితను కలిసిన ఏనుగు రవీందర్ రెడ్డి
ఉమ్మడి నిజామాబాదు స్థానిక సంస్థ ల ఎమ్మెల్సీ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవితను టీబీజీకేఎస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ , కార్పొరేట్ చర్చల అధికార ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి కలిశారు. మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్న కవిత గెలుపు నల్లేరు మీద నడకేనని ఆయన స్పష్టం చేశారు. కవితక్కను కలిసిన వారిలో టీబీజీకేఎస్ నాయకులు శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి నెల్కి మల్లేష్ తదితరులు ఉన్నారు.