పక్క జిల్లా నేతతో పరేషాన్…

Telanga Congress: అంతా ఆయనే చేశాడు… పార్టీని కులాల వారీగా విభజిస్తున్నాడు.. విభజించి పాలించు అనే విధానం పాటిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు.. పార్టీని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు.. పక్క జిల్లా నేతకు ఇక్కడేం పని… ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. పెద్ద ఎత్తున ఫిర్యాదులు దాదాపు పది మంది నేతల వరకు మూకుమ్మడిగా ఫిర్యాదుల పరంపర.. ఇంతకీ ఎవరా నేత…? ఏంటి కథ…? నాంది న్యూస్లో
మూడు రోజుల కిందట గాంధీభవన్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్(Congress party’s state affairs in-charge Meenakshi Natarajan) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్(Adilabad District Congress) సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ఆద్యంతం ఆరోపణలు, ప్రత్యారోపణలుగా కొనసాగింది. నేతలంతా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. నేతల వ్యవహార శైలితో పాటు పార్టీపై పెత్తనం చేలాయించే నేతల తీరుపై ఫిర్యాదుల వెల్లువలా వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ముగ్గురు నేతలు ఒకే నేతను లక్ష్యంగా చేసుకుని మీనాక్షి నటరాజన్ ముందు పలు అంశాలను ఏకరవు పెట్టారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ నేత తమపై పెత్తనం చేస్తున్నాడంటూ ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాల నేతలు మూకుమ్మడి ఫిర్యాదు చేశారు. ఆయన పెత్తనం చేలాయించడమే కాకుండా పార్టీ ఫండ్ పంపకాల్లో సైతం వేలు పెడుతున్నాడని దుయ్యబట్టారు. అంతేకాదు జిల్లాల్లో పనిచేసే అధికారుల బదిలీల్లో సైతం ఆయనదే ప్రధాన పాత్ర అని ఆ ముగ్గురు నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీని కులాల వారీగా విభజిస్తున్నారని జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చీలిపోవడం, గ్రూప్ లుగా మారడానికి ఆ నేతనే అని స్పష్టం చేశారు. అదే నాయకుడు కమ్మ కులాన్ని లేకుండా చేయాలని వ్యాఖ్యనించినట్లు సైతం నటరాజన్ దృష్టికి తీసుకురావడంతో విస్తుపోవడం అందరి నేతల వంతైంది.
ఆ నేత తమపై పెత్తనం చేస్తున్నాడంటూ ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాల నేతలు మూకుమ్మడి ఫిర్యాదు చేశారు. ఆయన పెతనం చేలాయించడమే కాకుండా పార్టీ ఫండ్ పంపకాల్లో సైతం వేలు పెడుతున్నాడని దుయ్యబట్టారు. అంతేకాదు జిల్లాల్లో పనిచేసే అధికారుల బదిలీల్లో సైతం ఆయనదే ప్రధాన పాత్ర అని ఆ ముగ్గురు నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీని కులాల వారీగా విభజిస్తున్నారని, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చీలిపోవడం. గ్రూప్ లుగా మారడానికి ఆ నేతనే అని స్పష్టం చేశారు. అదే నాయకుడు సిర్పూరు నియోజకవర్గంలో ఓ కులాన్ని లేకుండా చేయాలని వ్యాఖ్యనించినట్లు సైతం నటరాజన్ దృష్టికి తీసుకురావడంతో విస్తుపోవడం అందరి నేతల వంతైంది.
అసెంబ్లీ ఎన్నికల కంటే ముందునుంచే జిల్లాలో పాగా వేసిన ఆ నాయకుడు పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించినా ఆ నేత మొతం చెలాయించడం ఇక్కడి నేతలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చిన నేతలను ప్రోత్సహించడం.. పాత నేతలను పట్టించుకోలేకపోవడం కొన్ని నియోజకవర్గాల్లో ప్రజాబలం లేని నాయకులను ప్రోత్సహిస్తున్నట్లు సొంత పార్టీ నేతలే గగ్గోలు పెడుతున్నారు ఇదేంటని చెప్పే సాహసం ఇప్పటికి ఎవ్వరు చేయలేదు. తనకు రాష్ట్ర స్థాయిలో పెద్దనేతల అండ ఉందని చెప్పుకోవడంతో మిగతా వారు ఎవరూ కూడా నోరు విప్పే ప్రయత్నం చేయలేదు.
ఇక, చివరగా మీనాక్షి నటరాజన్ గ్రూప్ లు వద్ద కో ఆర్డినేషన్ కోసం ఓ కమిటీ వేస్తామని స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ సైతం ఈ వ్యవహారంలో సీరియస్ అయ్యారు. పెత్తనం చేసే వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని జిల్లాలో కాలు పెట్టనీయనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో చూడాలి మరి…