విలేకరుల పేరుతో డబ్బులు డిమాండ్… ముగ్గురిపై కేసు

Bellampalli: విలేకరుల పేరుతో డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురి వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి వన్‌టౌన్ సీఐ దేవయ్య వెల్లడించారు. శుక్రవారం రాత్రి బెల్లంపల్లి పట్టణం కృష్ణ మందిర్ లైన్ లో ఉన్న నిత్యా పిల్లల హాస్పిటల్ కు నవాబ్ , శంషాద్ అహ్మద్ ఇంకొక వ్యక్తి కలిసి వచ్చి మేము ఎలక్ట్రానిక్ జర్నలిస్టులమని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్ ను డబ్బులు అడిగారు. దీంతో ఆ డాక్టర్ డాక్టర్ డబ్బుల విషయం నాకు సంబంధం లేదని స్ఫష్టం చేశాడు. తమ మేనేజ్మెంట్ ని కలవాలని చెప్పడంతో వారు ముగ్గురు కొమురవెల్లి సంతోష్ వద్దకు వచ్చి పదివేల రూపాయలు కావాలని డిమాండ్ చేశారు. దీంతో తన దగ్గర డబ్బులు లేవని సంతోష్ చెప్పడంతో అతనితో గొడవకు దిగారు. ఈ విషయంలో బాధితుడి ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.