ఇంటికే రాములోరి తలంబ్రాలు..

TSRTC: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం(Bhadrachalam)లో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు TSRTC లాజిస్టిక్స్ సెంటర్లలో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలి. రామయ్య కల్యాణం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు TSRTC హోం డెలివరీ చేస్తుంది.
భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా శ్రీరాముని కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను వ్యయప్రయాసలు లేకుండా భక్తుల ఇంటికి చేర్చేందుకు నాలుగేండ్ల కిందటే TSRTC యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి ఆదరణ లభించింది. భద్రాద్రిలో ఏప్రిల్ 6న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్ మేనేజర్ పీ. సోలోమాన్ కోరారు. ఈ తలంబ్రాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కార్గో కౌంటర్ల ద్వారా 15.03.2015 నుంచి 07.04.2025 వరకు బుకింగ్ చేసుకోనే అవకాశం ఉందని చెప్పారు. భక్తులు సంప్రదించలసిన ఫోన్ నంబర్లు డిపోల వారిగా….
1) ఆదిలాబాద్ & ఉట్నూర్ డిపో – 9154298531
2) నిర్మల్ డిపో – 9154298547
3) భైంసా – 9154298541
4) మంచిర్యాల డిపో – 7382842/388 7382841860
5) అసిఫాబాద్ డిప్లొ- 9154298534
6) రీజినల్ మేనేజర్ కార్యాలయం – 9154298553
ఈ మంచి అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్ మేనేజర్ పీ. సోలోమాన్ కోరారు.