బాధితులకు అండగా భరోసా సెంటర్

-జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు
-బాధిత మహిళలకు చెక్కులు అంద‌చేత‌

బాధిత మహిళలు, పిల్లలకి అండగా భరోసా సెంటర్ సేవలు అందిస్తుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అన్నారు. లైంగిక దాడికి గురైన మహిళలు, బాలికలకు అండగా భరోసా సిబ్బంది పని చేస్తార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా వచ్చిన విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ ను బాధిత మహిళలైన ఆరుగురికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున అందించారు. ఈ సంద్భంగా ఆయ‌న మాట్లాడుతూ భ‌రోసా కేంద్రం ద్వారా మ‌హిళ‌ల‌కు అన్ని ర‌కాలుగా అండంగా ఉంటామ‌ని చెప్పారు. బాధిత మహిళలకు కౌన్సిలింగ్ , వైద్య ప‌రీక్ష‌ల్లో సైతం కూడా బాధితులకు అండగా ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు. భరోసా ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

భ‌రోసా కేంద్రం ద్వారా పోలీసు సేవలు, కౌన్సిలింగ్, వైద్య, న్యాయ సేవలు అందిస్తామ‌న్నారు. ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే 8712670561 నెంబర్, డయల్ 100 ద్వారా భరోసా కేంద్రాన్ని సంప్రదించాల‌ని ఎస్పీ డివి శ్రీనివాసరావు స్ప‌ష్టం చేశారు. కార్యక్రమంలో భరోసా సెంటర్ ఇంచార్జ్ మహిళా ఎస్సై తిరుమల, లీగల్ సపోర్ట్ పర్సన్ శైలజ, డిసిఆర్బి డి.ఎస్.పి కరుణాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, డి.సి.ఆర్.బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఆర్.ఐ అడ్మిన్ పెద్దన్న, సీసీ కిరణ్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like