అది నా సొంత వాహనమే…

టీఎస్ 02 ఎఫ్ఎల్ 4985 కారు తన సొంత వాహనమని, అది ప్రభుత్వ వాహనం కాదని మంచిర్యాల జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్ స్పష్టం చేశారు. ఆయన నాంది న్యూస్‌తో మాట్లాడారు. ప్రభుత్వ వాహనంలో తన భార్య జన్నారం వెళ్లి విధులు నిర్వహిస్తున్నారని వచ్చిన కథనం నిజం కాదన్నారు. అవసరం అయితే తాను బస్సులో ప్రయాణం చేస్తారు తప్ప ప్రభుత్వ వాహనం వాడరని తెలిపారు. తనకు ప్రభుత్వం కేటాయించిన వాహనం వేరే ఉందని ఆయన స్పష్టం చేశారు. కార్యాలయానికి, ఇతర ప్రాంతాలకు సమావేశాలు, సెంటర్ల విజిట్లకు తన కారు వాడుతాను తప్ప మిగతా వ్యవహారాలకు సొంత కారు వాడుతానని రౌఫ్‌ఖాన్ వెల్లడించారు.